User Avatar Crime, News

దారి దోపిడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు.. 

 దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను గోకవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 6వ తేదీ రాత్రి కొత్తపల్లి రహదారి పక్కన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి  బహిర్భూమికి వెళుతుండగా  గుర్తు తెలియని వ్యక్తులు చాకుతో బెదిరించి సెల్ ఫోను, రూ‌. 2 వేలు,  స్కూటీ బలవంతంగా లాక్కుని పరారైనారు. దీనిపై ఎస్ఐ పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా గ్రామానికి చెందిన నల్లంశెట్టి రాజేష్, లింగంపల్లి శివ మోహన్, తుమ్మల అరవింద్  నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.