User Avatar News

50 వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ….

రాజమహేంద్రవరం, నవంబర్ 1 : కూటమి ప్రభుత్వం ప్రతినెల 1వ తారీఖున అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పార్టీలకతీతంగా అర్హులందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తుందన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపి భరోసా కల్పించడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా తుఫాను వరద బాధితులకు కూటమి ప్రభుత్వం చౌకధర డిపోల ద్వారా రేషన్ సరుకులను కూడా అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50 వార్డ్ ఇంచార్జ్ మరుకుర్తి రవి యాదవ్, చింతపల్లి నాని, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.