User Avatar News

మొంథా తుఫాను వలన నష్టపోయిన 1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం కలెక్టర్ కీర్తి చేకూరి

జిల్లాలో మొంథా తుఫాను వలన నష్టపోయిన 1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రభుత్వం అంజేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
👉 రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలోని మండలాలకు 583 కుటుంబాలకు రూ.11.39 లక్షలు పంపిణీ వివరాలు..
అనపర్తి 166 కుటుంబాలకు రూ. 3.45 లక్షలు, బిక్కవోలు 38 కుటుంబాలకు రూ.74,000, గోకవరం 2 కుటుంబాలకు రూ.6,000, కడియం 122 కుటుంబాలకు రూ.2.06 లక్షలు, కోరుకొండ 19 కుటుంబాలకు రూ.41,000, రాజమహేంద్రవరం అర్బన్ 120 కుటుంబాలకు రూ.2.67 లక్షలు, రాజమహేంద్రవరం రూరల్ 89 కుటుంబాలకు రూ.1.55 లక్షలు, రాజానగరం 27 కుటుంబాలకు రూ.45,000  పంపిణీ చేశారు.
👉 కొవ్వూరు డివిజన్‌ మండలంలో 602 కుటుంబాలకు రూ.11.87 లక్షలు పంపిణీ వివరాలు…
చాగల్లు 19 కుటుంబాలకు రూ.50,000, దేవరపల్లి 64 కుటుంబాలకు రూ.1.21 లక్షలు, గోపాలపురం 58 కుటుంబాలకు రూ.1.15 లక్షలు, కొవ్వూరు 53 కుటుంబాలకు రూ.1.17 లక్షలు, నల్లజర్ల 65 కుటుంబాలకు రూ.1.48 లక్షలు, నిడదవోలు 177 కుటుంబాలకు రూ. 3.13 లక్షలు, పెరవలి 85 కుటుంబాలకు రూ.1.42 లక్షలు, తాళ్లపూడి 31 కుటుంబాలకు రూ.64,000, ఉండ్రాజవరం 50 కుటుంబాలకు రూ.1.17 లక్షలు పంపిణీ చేశారు.