User Avatar News

రాజానగరం పంచాయతీ విభజన జరిగితే నష్టం.. పాలకమండలి

గ్రామ పంచాయతీ రెండుగా విభజన జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది అని రాజానగరం పంచాయతీ పాలకమండలి మిజారిటీ సభ్యులు తీర్మానం చేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి అధ్యక్షుతన ప్రత్యేక సమావేశం గురువారం జరిగింది. దీనిలో పాలకమండలి సభ్యులు ప్రగడ చక్రధరావు, ఉప్పలపాటి అనంతలక్ష్మి, మట్ట సత్యవతి, అంకం సాయిబాబా, యక్కల వెంకటనాగేశ్యరావు, ప్రగడ అరుణ, కొల్లి వీర్రాజు, కొల్లి విజయలక్ష్మి, జి. మంగారత్నం, రాపాక తులసి గ్రామ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చి మాట్లాడుతూ యాభై ఏళ్ళు నుండి రాజానగరం, సూర్యారావుపేట విద్య, వైద్యం, మంచినీళ్లు, రహదారులు తదితర మౌళిక సదుపాయాల  వసతులు ఒక్కటిగా ఉన్నాయని తెలిపారు. గ్రామాన్ని రెండుగా విభజన చేస్తే ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు.