User Avatar Crime

లారీ ఢీ కొని రాజానగరం పంచాయతీ కార్మికుడు మృతి

లారీ ఢీ కొని గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి చెందిన సంఘటన రాజానగరం జాతీయ రహదారి వైఎస్ఆర్ జంక్షన్లో శుక్రవారం జరిగింది. గ్రామ పంచాయతీలో విధులు నిమిత్తం  టివిఎస్ మోటార్ సైకిల్ పై చంద్రమళ్ళ వీర్రాజు, కొత్తపల్లి శ్రీను (36) వైఎస్ఆర్ జంక్షన్ సర్వీస్ రోడ్డ్ నుండి జాతీయ రహదారి వైపుకు మలుపు తిరుతుండగా రాజమహేంద్రవరం వైపుకు వెలుతున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో లారీ శ్రీను ఈచ్చుకుంటూ వెల్లడం వలన నడుము తీవ్ర గాయాలైనాయి. చికిత్స కోసం 108లో రాజమహేంద్రవరం ప్రభుత్య ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో శ్రీను మృతి చెందినట్ల వైద్యలు తెల్పారు. వీర్రాజు స్వల్ప గాయాలైనాయి. మృతుడుకి భార్య, పదమూడేళ్ళ కుమార్తె ఉన్నారు. దీనిపై ఎస్ఐ జివివి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.