User Avatar Political

రాజానగరం మండలంలో దాదాపుగా ఖరారైన సహాకార సంఘాల‌ పదవులు.. సీతానగరం, కోరుకొండ సమయం పట్టే అవకాశం.

రాజానగరం నియోజకవర్గంలో సహాకార సంఘాల‌ అధ్యక్షులు, సభ్యులు నియామకం ఆసక్తి నెలకొంది. దీనికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కూటమి విజయానికి కృషి చేసిన వారికి అవకాశం ఇస్తున్నారు. దీనిలో రాజానగరం మండలంలో  టిడిపి నాయకులకు దివాన్ చెరువు సహకార సంఘం ముత్యం రాజబాబు నందరాడ సహాకార సంఘం గోలి రాజబాబు, జనససేన పార్టీ నాయకులకు భూపాలపట్నం సహకార సంఘం మద్దిరెడ్డి బాబులు,  కానవరం సహకార సంఘం నాతిపాం దొరబాబుకు అధ్యక్ష పదవులు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇవి అధికారికంగా ప్రకటించ లేదు. కోరుకొండ మండలంలో టిడిపికి శ్రీరంగపట్నం బూరుగుపూడి దోసకాయలపల్లి జనసేన పార్టీకి కోరుకొండ గాడాల కేటాయిస్తారని సమాచారం. సీతానగరం మండలంలో సహాకార సంఘాల అధ్యక్షులు నియామకం తర్జనభర్జనలు పడుతున్నారు.