User Avatar News

4వ తేదీన రాజానగరంలో పవర్ కట్

 ఈ నెల 4వ తేదీ రాజానగరం విద్యుత్ సబ్ స్టేషన్ 11 కెవి ఫీడర్లు  వార్షిక మరమ్మత్తు వలన విద్యుత్ సరఫరా ఉండదని ఎక్జిక్యూటివ్ ఇంజనీర్  జెపిబి నటరాజన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు రాజానగరం, సూర్యారావుపేట, ఇండస్ట్రీల్ ఫీడర్, గైట్  ఇంజనీరింగ్ కళాశాల, నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమండ్రి పేపర్ మిల్లు, బ్రిడ్జి కౌంటీ, తూర్పు గోనగూడెం, పల్లకడియం, రామస్వామి పేట, ఐశ్వర్య రైస్ మిల్, లేనోరా డెంటల్ కాలేజీ, క్వారీ, సాక్షి పేపర్ కార్యాలయం, ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం  ఉంటుందన్నారు. దీనికి వినియోగదారులు సహకరించాలని కోరారు.